కాంగ్రెస్‌ గూడికి BRS నేతలు ?

కోదాడ అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ ):సూర్యాపేట జిల్లా కోదాడ లో రాజకీయాలు మారుతున్నాయి. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే చందర్‌ రావు,  కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్‌ శశిధర్‌ రెడ్డిని మాజీ పీసీసీ ఛీఫ్‌  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలవనున్నారు. ఇద్దరు నేతల్ని పార్టీలోకి ఉత్తమ్‌  ఆహ్వానించనున్‌ఆరు. ఇప్పటికే నియోజకవర్గంలోని ముగ్గురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్‌ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు.

ఎమ్మెల్యే  బొల్లం మల్లయ్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టికెట్‌ ఆశించి రాకపోవడంతో పార్టీ మారేందుకు శశిధర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ రావు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....