కాంగ్రెస్‌ నేత ఇళ్లకు కరెంట్‌ ఆపాలి MLC కవిత

నిజామాబాద్‌ అక్టోబర్ 26 (ఇయ్యాల తెలంగాణ ):రాహుల్‌ గాంధీ వర్సెస్‌ రైతన్నలు ఈ ఎలెక్షన్‌. రైతన్నలకు రైతుబంధు మాత్రమే ఆపలా? పేదింటికి రేషన్‌ బియ్యం, ముసలవ్వలకు ఆసరా పెన్షన్‌, అక్కలకు బీడీ పెన్షన్‌, ఇంటింటికి మిషన్‌ భగీరథ తాగునీరు, ఇండ్లకి, పరిశ్రమలకు 24 గంటల కరెంటు, షాదీ శాధి ముబరక్‌ , కళ్యాణ లక్ష్మి ఇలా అన్ని ఎన్నికల కోడ్‌ పేరు చెప్పి ఆపే కుట్రను కూడా చేస్తుందా రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె విూడియాతో మాట్లాడారు. నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి  కాంగ్రెస్‌ తెరలేపింది. బిఆర్‌ఎస్‌ రాజకీయ సుస్థిరత సాదించింది .. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటది. బెంగుళూర్‌ ని ఐటి లో క్రాస్‌ చేశాము .. ఐటి హబ్‌ లు వచ్చాయి .. ఇండస్ట్రియల్‌ జోన్స్‌ కూడా వస్తాయి. తెలంగాణ ను పట్టణీకరణ చేస్తున్నాం. కాంగ్రెస్‌ ఆరోపణలు చూస్తే వాళ్ళ అభద్రతా భావం కనిస్పిస్తుంది. సంక్షేమ పథకాలు ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఫీసర్లను మార్చాలని ,  రైతు బందు , దళిత బందు ఆపాలని కాంగ్రెస్‌ అంటుంది.

ఆలా అయితే కాంగ్రెస్‌ వాళ్ల ఇళ్లకు కరెంట్‌ ఆపాలి. తెలంగాణ వచ్చిన తర్వాతనే కరెంట్‌ వచ్చింది కదా. బిజెపి లాగ పేర్లు మార్చి పథకాలు పెట్టడం లేదు. యూపిఎస్సి తరహా జాబ్‌ క్యాలెండర్‌ అనే కాంగ్రెస్‌ హావిూ .. ఎన్నికల హావిూ మాత్రమే . కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ల్లో ఎందుకు అమలు చేయడం లేదు. గాంధీ లకే గ్యారంటీ లేదు .. అధ్యక్షుడు లేకుండా హావిూ ఇస్తారు ..అవి ఎలా నమ్మాలని ఆమె అన్నారు.

బిసిలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్‌. 2010 లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బి సి లను చేర్చకుండా బిసిలకు అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

అరవింద్‌ ను కోరుట్ల లో ఓడిస్తాం . రేవంత్‌ కామారెడ్డికి వచ్చిన , ఈటెల గజ్వెల్‌ లో పోటీ చేసిన  మా పార్టీకి వచ్చిన నష్టం లేదని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....