కాంగ్రెస్‌ పార్టీలో ఎగిసిపడుతున్నాయి అసంతృప్తి జ్వాలలు

 మహబూబ్‌నగర్‌ అక్టోబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ): కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి టికెట్లుఅమ్ముకున్నావని ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో దేవరకద్ర కాంగ్రెస్‌ నాయకులు మరింత రెచ్చిపోయారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం పై దాడి చేసిపీసీసీ అధ్యక్షుడు చాంబర్లు ధ్వంసం చేశారు.దేవరకద్ర కాంగ్రెస్‌ టికెట్‌ను బీసీ నేత ప్రదీప్‌ గౌడ్‌ను కాదని మధుసూదన్‌ రెడ్డికి ఇవ్వడంతో ఆగ్రహం చెందినా ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు సోమవారంజిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో హంగామా సృష్టించారు. తనకు టికెట్‌ ఇవ్వకుండా తీవ్రంగా అవమానించిన పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన విూడియా సమావేశంలోమాట్లాడుతూ.. దేవరకద్ర టికెట్‌ తనకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.లేని పక్షంలో ఏం చేయాలో కార్యకర్తలే నిర్ణయిస్తారని ప్రకటించి బయటికి వెళ్లారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన మద్దతు దారులు కాంగ్రెస్‌పార్టీ ఆఫీసులోకి చొరబడి కుర్చీలను, బ్యానర్ల చించి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కుర్చీలు అన్నింటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ కార్యాలయం ఆవరణ మొత్తం పీకి పందిరి వేశారు. తమనేతకు టికెట్‌ ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామని శపథం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....