కాంగ్రెస్ Party సీనియర్ నాయకులు బాల పోచయ్యను ప్రభుత్వం ఆదరించాలి !

హైదరాబాద్, జనవరి 4 (ఇయ్యాల తెలంగాణ) : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల పోచయ్య ను తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం సత్యనారాయణ కలిశారు. బుద్వేల్ రాజేంద్రనగర్ లోని బాల  పోచయ్య ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని ఆయన గతంలో చేసిన అనేక సేవలను, సేవా కార్యక్రమాల్లో వారు చేసిన కృషిని గుర్తు చేశారు. బాల పోచయ్య గారి ఆరోగ్యము సరిలేదని తెలవడంతో వెంటనే వారి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య సమస్యలను తెలుసుకొని ఆయనకు ధైర్యం చెప్పారు. 

మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆరోగ్య రీత్యా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వారికి ధైర్యం చెప్పడంతో పాటు ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. పార్టీ కోసం ఎనలేని సేవలందించిన బాల పోచయ్య గారిని ప్రభుత్వం గుర్తించి తగిన సహాయం అందించాలని కోరారు. తమవంతు శాయ శక్తులా అండగా నిలుస్తామని తెలిపారు. బాల పోచయ్య  గారి భార్య కూడా అనారోగ్యాంగానే ఉన్నట్లు తెలిపారు. ఆమెకు కిందపడి కాలు విరిగడంతో  ఆమె మంచాన పడ్డది.  అని చెప్పారు. పార్టీ కోసం అహర్నిశలు పాటు పడిన పోచయ్య గారికి ఒక సొంత ఇల్లు లేదు  కూడా లేదని కిరాయి ఇంట్లోనే ఉంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో 50 సంవత్సరాలకు పైగా పనిచేస్తూ విశిష్ట సేవలందించిన బాలపోచయ్య గారిని గుర్తుపట్టని వాళ్లు నేను కాంగ్రెస్ పార్టీలో లేరనడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా సేవలు చేసిన ఆయనను ఎంతోమంది పనిచేసే ఉన్నత స్థాయిలకు ఎదిగినా బాలపోచయ్య కు మాత్రం ఇప్పటి వరకు పట్టించుకోక పోవడం విశేషం.  కావున బాలపోచయ్య పై దయ తలచి కాంగ్రెస్ పార్టీ మిత్రులు సహాయ సహకారాలు అందించగలరని బాలపోచయ్య  ఆశిస్తున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....