హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఇయ్యాల తెలంగాణ) : కాంగ్రేస్ పార్టీ హయంలోనే సఫాయ్ కర్మచారులకు న్యాయం జరుగుతుందని యాకూత్ పుర కాంగ్రేస్ పార్టీ ఇన్చార్జ్ సయ్యద్ షౌకత్ అన్నారు. తెలంగాణ సఫాయ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో జరిగిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. సఫాయ్ కార్మిక సంఘం నాయకుడు వేల్పూల కృపాదానం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సయ్యద్ షౌఖత్ మాట్లాడుతూ కరోన సమయంలో సఫాయ్ కర్మచారుల సేవలు అమోగం అని కొనియాడారు. ఇటివలే కాంగ్రేస్ పార్టీ ఎమ్మేల్సీ గా ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా సఫాయ్ కర్మచారుల సమస్యలను తిసుకేల్లామని, త్వరలోనే కృపాధానం కార్మిక సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కూడా జిహెచ్ఎంసి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్ఠి సారించారన్నారు. జిహెచ్ఎంసి విశ్రాంత వేహికిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర సీనియర్ కాంగ్రేస్ నాయకుడు నీలం శ్రీనివాస్ యాదవ్, కే చిత్తారి, స్వామి, వేంకటేశ్,అంజయ్య,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రేస్ పార్టీ హయంలోనే SAFAI కర్మచారులకు న్యాయం :
Leave a Comment