కాంట్రాక్టు ఉద్యోగినికీ ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే: ఢల్లీ హైకోర్టు

న్యూఢల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ): కాంట్రాక్టు ఉద్యోగినికీ ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందేనని ఢల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. ప్రసూతి సెలవులను నిరాకరించడం అమానవీయమని పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగం అనే సాకు చెప్పి సెలవులను నిరాకరించడం ఆమె ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని తెలిపింది.ఢల్లీ యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిలో సహాయకురాలిగా పని చేస్తున్న ఓ ఉద్యోగిని ప్రసూతి సెలవులు తీసుకోగా.. ఆమెను యూనివర్సిటీ సర్వీస్‌ నుంచి తొలగించింది. దీనిపై ఆమె ఢల్లీహైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ చంద్రధరి సింగ్‌ విచారణ చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగం అయినంత మాత్రాన నోటీసులు లేకుండా ఉద్యో గం నుంచి తొలగించడం చట్టవిరుద్ధమ ని హైకోర్టు పేర్కొంది. వెంటనే ఆమెను సర్వీసులోకి తీసుకొని, నష్టపరిహారంగా రూ.50 వేలు చెల్లించాలని ధర్మాసనం యూనివర్సిటీని ఆదేశించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....