కాణిపాకంలో Vinayaka చవితి 18నే

తిరుపతి, సెప్టెంబర్‌ 7, (ఇయ్యాల తెలంగాణ) : హిందువుల పండగలను ఎక్కువగా మాసం,  తిధుల ప్రకారం జరుపుకుంటారు. అయితే గత కొంతకాలంగా ఎక్కువగా పండగ తిథులు రెండో రోజులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రోజు పండగ జరుపుకోవాలని సందేహం కల్గుతూనే ఉంది. తాజాగా విఘ్నాలకధిపతి అయిన వినాయకుడి ఫెస్టివల్‌ కు వివాదం తప్పలేదు. వినాయక చవితి ఈనెల 18న జరుపుకోవాలా లేక 19న జరుపుకోవాలా అన్నది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం మాత్రం చవతి తిధి ఈ నెల 18 నే అంటోంది. కాణిపాకం దేవస్థానం 18న వినాయక చవితి జరుపుతోంది.వినాయక చవితి పండగను ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలో అన్నది ఒక వివాదంగా మారింది. 18న జరుపుకోవాలా.. లేదంటే 19న చవితి చేసుకోవాలా అన్న కన్ఫ్యూజన్‌ కొనసాగుతోంది. 

గణాధిపతి , ప్రధమ  పూజ్యుడు వినాయకుడు జన్మదినాన్ని చవితి పండగగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిధిన ప్రతి ఏడాది వినాయక చవితి ని జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది చవితి తిధి రెండు రోజులు వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలోని ప్రజల్లో పండుగ 18 న లేక 19 నా అన్న తర్జనభజన కొనసాగుతోంది. అయితే వినాయక చవితి ఈనెల 18 నే జరుపుకోవాలని స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం స్పష్టం చేస్తోంది.ఈ నెల 18 నే కాణిపాకం దేవస్థానం వినాయక చవితి పండుగను జరుపుతోంది. భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి పై ఎన్నో వాదనలు ఉన్నాయని అర్చకులు చెబుతున్నారు. చంద్రమానం ప్రకారం చవితి తిధి 18 నే ఉందని చెబుతున్నారు. వినాయక చవితి పండుగ అదే రోజు జరుపుకోవాలంటున్నారు. అంతేకాదు ఈ మేరకు కాణిపాకంలో వెలసిన సిద్ధి వినాయకుడి ఆలయం చవితి వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు.  అంతేకాదు ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూడా చవితి వేడుకలను సెప్టెంబర్‌ 18నే జరపడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....