మద్దికేర,మే 14 (ఇయ్యాల తెలంగాణ) : మండల కేంద్రమైన మద్దికేర గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షష్టి సందర్భముగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు విజయ్ ప్రసాద్ యాదవ్ తెలిపారు.మంగళవారం వేకువ ఝామున అర్చకులు స్వామివారికి సామూహిక పంచాంభృత అభిషేకాదులు నిర్వహించి, నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, ఆభరణాలతోను, వివిధ రకాల పూలమాలల తోను సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.జాతకంలో ఆశ్లేష నక్షత్ర దోషము,కుజదోషం,రాహుకేతు నివారణ,ఉద్యోగ విద్య వ్యాపార అభివృద్ధి కొరకు వివాహ సంతాన ఆరోగ్య సమస్యల కొరకు పలువురు భక్తులు సామూహిక హోమాలు చేశారు.పలువురు భక్తులు ఆలయానికి చేరుకొని స్వామి వారికి కానుకలు సమర్పించుకొన్నారు.ఆలయానికి విచ్చేసిన భక్తాదులకు దాతల సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
కార్తికేయునికి షష్ఠి పూజలు : Vijay Prasad
Leave a Comment