జయశంకర్ భూపాలపల్లి, జులై 28,(ఇయ్యాల తెలంగాణ ): కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టులోని లక్ష్మీబ్యారేజీ 85 గేట్లు ఎత్తివేసారు. మేడిగడ్డ బ్యారేజీకి ఇన్ ఫ్లో 8.21 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి గోదావరి నుంచి 7.61 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. మానేరు నుంచి అన్నారం బ్యారేజీకి 5.33 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, అన్నారం బ్యారేజీకి ఉన్న మొత్తం 66 గేట్లు ఎత్తివేసారు. అన్నారం బ్యారేజి నుంచి మొత్తం 12.95 లక్షల క్యూసెక్కులు విడుదల చేసారు.