కిటకిటలాడుతున్నBus స్టాండ్లు, Railway – స్టేషన్లు

సికింద్రాబాద్‌, జనవరి 12 (ఇయ్యాల తెలంగాణ) : సంక్రాంతి పండుగ, సెలవులను పురస్కరించుకొని నగరవాసులంతా సొంతూళ్లకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు.. వీరి రద్దీతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, జూబ్లీ బస్‌ స్టేషన్ల కిటకిటలాడుతున్నాయి. రైల్‌ లో, బస్‌ లో బెర్త్‌ ల కోసం ప్రయాణికుల తోపులాటలు, వాగ్వివాదాలతో దద్దరిల్లుతున్నాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో ప్రత్యేక రైల్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.. జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుండి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు సైతం తరలివస్తుండడంతో రద్దీ నెలకొంది.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ జూబ్లీ బస్‌ స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరగడంతో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....