కెనడాతో వివాదం..భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఏవిూ లేదు

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 22 (ఇయ్యాల తెలంగాణ ): ఖలిస్తాన్‌ ఏర్పాటువాద నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో భారత్‌? కెనడా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది. ఆ తర్వాత దౌత్యవేత్తలను కెనడా బహిష్కరించింది. అయితే, దీనిపై భారత్‌ సైతం ఘాటుగానే స్పందించింది. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. వీసా సేవలను సైతం నిలిపివేసింది. కెనడాలో ఉన్న భారతీయులకు అప్రమత్తంగా ఉండాలంటూ అలెర్ట్‌ జారీ చేసింది.కాగా, రెండు దేశాల మధ్య నెలకొన్ని వివాదంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. రెండు దేశాలతోనూ తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివన్‌ గురువారం విూడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈ అంశంపై దౌత్యవేత్తలతో జరిగిన ప్రైవేటు సంభాషణల గురించి నేను మాట్లాడను. ఈ విషయంలో భారత్‌లో ఉన్న అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక ముందు కూడా వారితో టచ్‌లో ఉంటాం’ అని అన్నారు.ఇక ఇదే సమావేశంలో ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దౌత్యపరమైన వివాదంపై ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నారా..?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇది మాకు (అమెరికా) ఆందోళన కలిగించే విషయం. ఇది మేము తీవ్రంగా పరిగణించే అంశం. నిరంతరం దీనిపై సంప్రదింపులు చేస్తాం. ఈ విషయంలో భారత్‌కు ‘ప్రత్యేక మినహాయింపు’ ఏవిూ లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....