కేంద్రం కనుసన్నల్లోనే విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్‌ : చిదంబరం

న్యూఢల్లీ  నవంబర్‌ 1 (ఇయ్యాల తెలంగాణ ):  దేశవ్యాప్తంగా ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం మళ్లీ దుమారం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారంటూ పలువురు విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. పలువురు ప్రతిపక్ష ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్‌ నుంచి ఒకేసారి ‘హ్యాకింగ్‌ అలర్ట్‌’ సందేశాలు రావడం సంచలనంగా మారింది. ఈ అంశంపై విపక్షాలు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.వందలాది విపక్ష నేతలకు యాపిల్‌ నుంచి హ్యాకింగ్‌ అలర్ట్‌ మెసేజ్‌లు రావడం కేంద్రం కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందనే అనుమానాలు రేకెత్తిస్తోందని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం అన్నారు. విపక్ష నేతలకే ఇలా ఎందుకు జరుగుతోంది..? విపక్ష నేతల ఫోన్లను హ్యాక్‌ చేయడానికి ఎవరికి ఆసక్తి ఉంటుందని ట్విట్టర్‌ వేదికగా చిదంబరం ప్రశ్నించారు. పెగాసస్‌ వ్యవహారం తర్వాత ఇప్పుడు అందరి అనుమానం ప్రభుత్వ ఏజెన్సీ వైపే ఉందని, ఇప్పటి వరకూ ఇది కేవలం అనుమానం మాత్రమేనని అన్నారు.ఇక నియమాలను బాహాటంగా విస్మరిస్తున్నారని, విపక్ష నేతల ఫోన్‌ హ్యాకింగ్‌కు కేంద్ర ఏజెన్సీలదే బాధ్యతని కాంగ్రెస్‌ నేత టీఎస్‌ సింగ్‌దేవ్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, రాజ్యాంగ ఉల్లంఘన అంటే విూరు నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారని ఆయన కాషాయ పాలకులను దుయ్యబట్టారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....