కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో CM రేవంత్‌ భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిమంగళవారం నాడు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిపారు. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్‌ గ్రేడ్‌ చేయాలని విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్‌ శ్రీశైలం ఫోర్‌ లైన్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌, హైదరాబాదు కల్వకుర్తి రహదారి నీ నాలుగు వరుసల గా అభివృద్ధి చేయడం,  రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఖీఖీఖీ)దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్‌ విజయవాడ జాతీయ రహదారిని ఆరువరుసల విస్తరించడం పై గడ్కరీ తో రేవంత్‌ రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చ జరిపారు.  సీఆర్‌ఐఎఫ్‌  నుండి తెలంగాణ కు నిధుల కేటాయింపు పెంచాలనీ విజ్ఞప్తి చేసారు. నల్గొండలో ట్రాన్స్పోర్ట్‌ ట్రైనింగ్‌ ఇన్స్టిట్యూట్‌ ఏర్పాటు చేయాలని,నల్గొండ పట్టణానికి బైపాస్‌ రోడ్డు మంజూరు చేయాలని  నితిన్‌ గడ్కరీ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....