కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన CM రేవంత్‌ రెడ్డి


రక్షణ శాఖ భూములను తెలంగాణకు బదలాయించండి 

న్యూఢిల్లీ, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్లో రహదారుల విస్తరణ ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని  కేంద్ర  రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రిని కలిసి అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు.  రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్‌ పరిశోధన కేంద్రం ఆర్సీఐ, ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, వరంగల్‌ నగరానికి గతంలోనే సైనిక్‌ స్కూల్‌ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని. ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం వరంగల్‌ సైనిక్‌ స్కూల్‌ అనుమతుల గడువు ముగిసిన కారణంగా వాటిని పునరుద్ధరించాలని లేదా కొత్తగా మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెంట ఉన్న లోక్‌ సభ ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్‌, సురేష్‌ షెట్కార్‌, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రఘువీర్‌ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి అజిత్‌ రెడ్డి ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....