కేంద్రమంత్రి శివరాజ్‌ చౌహన్‌ తో Telangana మంత్రి సీతక్క భేటీ !

న్యూఢిల్లీ, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తో  రాష్ట్ర పంచాయితీ రాజ్‌ గ్రావిూణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క భేటీ అయ్యారు. సీతక్క మాట్లాడుతూ  తెలంగాణలో పెండిరగ్‌ పనులను వెంటనే క్లియర్‌ చేయాల్సింది,  వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో  ప్రధానమంత్రి గ్రావిూణ సడక్‌ యోజన కింద రోడ్డు నిర్మించాలని కోరానని అన్నారు. రోడ్డు మార్గం లేని 164కు పైగా ఆదివాసి గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి.  అన్ని మారుమూల ఆవాసాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆదివాసి ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతులు ఇచ్చేలా చొరవ చూపాలి.  ఆదివాసి ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాల రోడ్డు నిర్మాణం కోసం తక్షణ నిధులు మంజూరు చేయాలని కోరానని అన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సానుకూలంగా స్పందించారని సీతక్క అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....