కేంద్ర బడ్జెట్‌ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ : డిప్యూటీ CM భట్టి

హైదరాబాద్‌, జూన్ 19 (ఇయ్యాల తెలంగాణ) : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  గాంధీభవన్లో విూడియాతో మాట్లాడారు.  అప్పులు చేసి సంపద సృష్టిస్తాం, ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. మహిళా సంఘాలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం. పార్టీలో కష్టపడి పనిచేసిన వారి సమాచారం అధిష్టానం వద్ద సమగ్రంగా ఉంది.. త్వరలోనే పనిచేసిన వారికి పదవులు అందుతాయి . రైతు రుణమాఫీకి పూర్తిగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కుల గణనా చేపట్టాలి తద్వారా దేశ సంపద వనరులు పంచబడాలి. పాలనలోను భాగస్వాములను చేయాలని మా డిమాండ్‌ అని అన్నారు.

మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు ప్రారంభమవుతాయి. కేంద్ర బడ్జెట్‌ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతాం

విద్యుత్‌ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరగాలని నిండు సభలో వాటి విద్యుత్‌ శాఖ మంత్రి  జగదీష్‌ రెడ్డి కోరారు.. న్యాయ విచారణ అంటే వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అర్థం కావడం లేదు. ఇదేశ సంపద వనరులు దామాషా ప్రకారం పంచబడాలని రాహుల్‌ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. జనాభా దామాషా ప్రకారం సంపద పదవులు పంచాలని ఆయన ఎన్నికల ముందు కోరారు.. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌ ఆలోచనలు అమలు చేస్తున్నాం.  రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాము వారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం.  దేశంలో కులగణను జరగాలని రాజీవ్‌ గాంధీ ఇచ్చిన పిలుపు విప్లవాత్మకమైనదని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....