కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన Bail ఉత్తర్వులపై Delhi హైకోర్టు స్టే !

 

ప్రధాని మోడీ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు : ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌

  న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఇయ్యాల తెలంగాణ) :  మనీ లాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ,హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో? ప్రధాని నరేంద్ర మోడీ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ శుక్రవారం ఆరోపించారు.‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)  వేదికగా సంజయ్‌ సింగ్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో ‘‘మోడీ ప్రభుత్వం గుండాయిజం చూడండి, విచారణ కోర్టు ఉత్తర్వు ఇంకా రాలేదు, ఆర్డర్‌ కాపీ కూడా రాలేదు.. మోడీ తాలూకు ఈడి మాత్రం హైకోర్టుకు చేరుకుంది. 

అయితే ఏ ఉత్తర్వును సవాలు చేయడానికి ఈడి హైకోర్టుకు చేరుకున్నట్టు? ‘’ అని నిలదీశారు. ‘‘మోడీజీ విూరెందుకు న్యాయ వ్యవస్థను అబాసుపాలు చేస్తున్నారు? దేశమంతా విూ వ్యవహారం చూస్తోంది !’’ అని ఆప్‌ ఎంపీ పోస్ట్‌ లో పెట్టారు. ఢిల్లీ,లిక్కర్‌ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ ఉత్తర్వులపై ఢిల్లీ,హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఇడి హైకోర్టుకు వెళ్లింది. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై ఢిల్లీ,హైకోర్టు స్టే విధించింది. ఇడి పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్‌ ఇవ్వకూడదని కోర్టు తెలిపింది.కాగా గురువారం ఢిల్లీ,మద్యం స్కామ్‌ సంబంధిత మనీలాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు ఢిల్లీ,కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక న్యాయమూర్తి నియాయ్‌ బిందు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దశలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఈ బెయిల్‌ ఆదేశాలను కనీసం 48 గంటల పాటు నిలిపివేయాలని, తాము ఎగువకోర్టుకు వెళ్లేందుకు వీలు కల్పించాలని వేడుకుంది. అయితే ఈ అభ్యర్థనను ప్రత్యేక న్యాయమూర్తి తోసిపుచ్చారు. కేజ్రీవాల్‌ రూ 1 లక్ష పూచీకత్తుతో విడుదలకు ఆదేశించిన కోర్టు కొన్ని షరతులు విధించిన విషయం విధితమే. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....