కొణిదెల వారి అమ్మాయి పేరు క్లీంకార!

హైదరాబాద్‌, జూన్‌ 30, (ఇయ్యాల తెలంగాణ) : గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ , ఉపాసన కొణిదెల  దంపతులు పది రోజుల క్రితం తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంగతి అందరికీ తెలుసు. మెగాస్టార్‌ ఇంట మహాలక్ష్మి అడుగు పెట్టిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కొణిదెల, కామినేని కుటుంబాలు చిన్నారి రాకతో సంతోషంలో మునిగాయి. లేటెస్ట్‌ అప్డేట్‌ ఏమిటంటే… ఈ రోజు ఆ అమ్మాయికి పేరు పెట్టారు. మెగా మనవరాలికి క్లీంకార కొణిదెల అని పేరు పెట్టినట్లు చిరంజీవి ట్వీట్‌ చేశారు. లలిత సహస్ర నామం నుంచి పేరు తీసుకున్నట్లు ఆయన వెల్లడిరచారు.

 ‘’క్లీంకార పేరు ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది. అమ్మవారి ‘శక్తి’ని నిక్షిప్తం చేస్తుంది. ఆ పేరులో శక్తివంతమైన వైబ్రేషన్‌ ఉంది. మా చిన్నారి పెరిగి పెద్ద అయ్యే కొలదీ ఆ లక్షణాలను పుణికి పుచ్చుకుంటుందని, తనలో నిక్షిప్తం చేసుకుంటుందని నమ్ముతున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఇంగ్లీష్‌ పరంగా చూస్తే… ఐశ్రీతిని ఐజీతీజీ అని చిరంజీవి పదాల మధ్య గాప్‌ ఇచ్చారు. దాంతో క్లిన్‌, కార అని కొందరు పలుకుతున్నారు.రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతుల బిడ్డకు ‘మెగా ప్రిన్సెస్‌’ అని ఆల్రెడీ అభిమానులు ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. ఈ రోజు మెగా ప్రిన్సెస్‌ కోసం ఓ ఫంక్షన్‌ చేశారు. మనవరాలిని మెగాస్టార్‌ చిరంజీవి ఉయ్యాలలో వేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన తల్లిదండ్రులు… అనగా వియ్యంకుల వారితో కలిసి దిగిన ఫోటోను చిరంజీవి షేర్‌ చేశారు. సాధారణంగా చిన్నారి పుట్టిన 21వ రోజున బారసాల వేడుక చేస్తారు. ఆ రోజు బిడ్డను ఉయ్యాలలో వేయడం, పేరు పెట్టడం (నామకరణం) చేస్తారు. 

చిరు మనవరాలు జన్మించి పది రోజులు మాత్రమే అయ్యింది. ఈ రోజు అమ్మాయికి నామకరణం చేశారు. అపోలో ఆస్పత్రిలో ఉపాసన డెలివరీ జరిగింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళే ముందు రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు పాపతో సహా విూడియా ముందుకు వచ్చారు. పాప ముఖాన్ని కనపడకుండా జాగ్రత్త పడ్డారు. అప్పుడు పాపకు ఆల్రెడీ పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నామకరణం రోజున పేరును చెబుతామని రామ్‌ చరణ్‌ తెలిపారు. ‘పాపది ఎవరి పోలిక?’ అని ప్రశ్నించగా… ‘’నాన్నలా ఉంది’’ అని చెప్పారు. రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులకు బిడ్డ జన్మించిన రోజున మెగాస్టార్‌ చిరంజీవి విూడియా ముందుకు వచ్చారు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. హనుమంతునికి ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజు అమ్మాయి పుట్టడంతో మెగాస్టార్‌ మరింత సంబరపడ్డారు. తన ఆనందం వ్యక్తం చేశారు. రామ్‌ చరణ్‌ విజయాలు, వరుణ్‌ తేజ్‌ నిశ్చితార్థం, మనవరాలు పుట్టడం… తమ ఇంట అన్నీ శుభకార్యాలు జరుగుతున్నాయని తెలిపారు.   ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో గత ఏడాది భారీ విజయం అందుకోవడం మాత్రమే కాదు, గ్లోబల్‌ ఆడియన్స్‌ కాంప్లిమెంట్స్‌ అందుకున్న రామ్‌ చరణ్‌… సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ దర్శకుడు శంకర్‌, అగ్ర నిర్మాత ‘దిల్‌’ రాజుతో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నారు. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇది పాన్‌ ఇండియా సినిమా. దీని తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్‌ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్‌ ఇండియా సినిమా చేయనున్నారు. కన్నడ దర్శకులు ప్రశాంత్‌ నీల్‌, నర్తన్‌ దర్శకత్వంలో కూడా ఆయన సినిమాలు చేసే అవకాశం ఉంది. చర్చలు జరుగుతున్నాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....