కొత్త బ్లడ్‌ గ్రూపు….. ఈఈఎం నెగిటివ్‌ – New Blood Group….. EEM negative

గాంధీనగరం, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ) :

ఎవరికైనా రక్తం కావాల్సివచ్చినపుడు పేషెంటు రక్తం ఏ గ్రూప్‌కి చెందిందో అదే గ్రూప్‌ రక్తం ఉన్నవారి నుంచి రక్తాన్ని కోరతారు. అలాగాకుండా కొందరికి మామూలుగా దొరికేది కాకుండా వేరే గ్రూప్‌ రక్తం కావాల్సి వస్తుంటుంది. అప్పుడు సదరు ఆస్పత్రి, డాక్టర్లు తెగ కంగారు పడుతూంటారు. ఎలాగో ఒక డోనర్‌ని పట్టుకోగల్లుతారు. అయితే అంతకు మించిన ఆశ్చర్యకరమేమంటే, గుజరాత్‌లో ఒక మనిషి రక్తం సహజంగా ఉండే ఏ, బి, ఓ లేదా ఏబి గ్రూప్‌ రక్తమే లభిస్తుంది. కానీ గుజరాత్‌ లో ఒక పెద్దా యనకు గుండెజబ్బు. ఆయన్ను ఆస్పత్రికి తీసుకువచ్చి ఆపరేషన్‌కి సిద్దపడ్డారు. అందుకు రక్తం కావాల్సి వచ్చింది. ఆయన రక్తం ఏ గ్రూప్‌కి చెందిందనేది డాక్టర్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. 

అది  ఇఎంఎం నెగెటివ్‌ గ్రూప్‌.  ఇది అసలు దొరకడమే దుర్లభం అని తేల్చారు. ఆ 65 ఏళ్ల పెద్దాయన రక్తం గ్రూప్‌ భారతదేశంలో లభిస్తుంది. ఇతర దేశాల్లో అంతగా లభించదని తెలుసుకున్నారు. మామూలుగా మనిషి శరీరంలో నాలుగు రకాల రక్తం గ్రూప్‌లు ఉంటాయి, వాటికి 42 రకాల అదనపు రక్తం రకాలు ఏ, బి, ఓ, ఆర్‌ హెచ్‌ అనేవి ఉంటాయిట. అలాగే ఇఎంఎం ఎక్కువగా ఉండే 375 రకాల యాంటిజెన్‌లు అంటే శరీరంలో రోగనిరోధక  ప్రతి స్పందనను ప్రేరేపించే టాక్సిన్‌ లేదా ఇతర విదేశీ పదార్ధం, ముఖ్యం గా నెగెటివ్‌ ల ఉత్పత్తి చేసేవి కూడా ఉంటాయి.ప్రపంచవ్యాప్తంగా అలాంటి పది మంది మాత్రమే వారి రక్తంలో ఇఎంఎం  హై`ఫ్రీక్వెన్సీ యాంటిజెన్‌ను కలిగి లేరు, ఇది వారిని సాధారణ మానవులకు భిన్నంగా చేస్తుంది. అటువంటి అరుదైన బ్లడ్‌ గ్రూపులు ఉన్నవారు తమ రక్తాన్ని ఎవరికీ దానం చేయలేరు లేదా ఎవరి నుండి పొందలేరు. ప్రపంచంలో ఇలాంటి అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారని, అయితే ఇప్పుడు గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ఈ బ్లడ్‌ గ్రూప్‌తో గుర్తించ బడ్డారని నివేదికలు చెబుతున్నాయి. గుండెపోటుతో అహ్మదాబాద్‌లో చికిత్స పొందుతున్న 65 ఏళ్ల రోగికి గుండె శస్త్రచికిత్సకు రక్తం అవసరమని సూరత్‌లోని సమ ర్పన్‌ బ్లడ్‌ డొనేషన్‌ సెంటర్‌  వైద్యుడు సన్ముఖ్‌ జోషి  తెలిపారు. అయితే అహ్మదాబాద్‌  ల్యాబొరేటరీలో అతని బ్లడ్‌ గ్రూప్‌ కనిపించకపోవడంతో ఆ నమూనాలను సూరత్‌లోని రక్తదాన కేంద్రానికి పంపారు. పరీక్ష తర్వాత, నమూనా ఏ గ్రూపుతో సరిపోలడం లేదు, దీంతో వృద్ధుడితోపాటు అతని బంధువుల రక్త నమూనాలను దర్యాప్తు కోసం అమెరికాకు పంపినట్లు ఆయన తెలిపారు.  ఆ తర్వాత , వృద్ధుని రక్త వర్గం భారతదేశంలో మొట్టమొదటిది  అలాగే ప్రపంచంలోని పదవ అరుదైన రక్త సమూహంగా గుర్తిం చినట్టు  డాక్టర్‌ జోడిరచారు. రక్తంలో ఇఎంఎం లేకపోవడంవల్ల, ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ (ఐఎస్‌ బిటి) దీనికి ఇఎంఎం నెగెటివ్‌ అని  పేరు పెట్టింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....