కొరివి కృష్ణస్వామి సేవలకు గుర్తుగా – Journalist అవార్డులు ప్రకటించేలా ప్రభుత్వం కృషి చేయాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ఇయ్యాల తెలంగాణ) :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మాజీ మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవలకు గుర్తుగా ఆయన పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ అవార్డులు ప్రకటించేలా కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకాదుడు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మేయర్ కొరివి కృష్ణ స్వామి అనేక సేవలను అందించారని ఆయన సేవలకు గుర్తుగా ఆయన పేరు మీద ప్రత్యేక అవార్డులు అందించడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కొరివి కృష్ణ స్వామి ఒక పత్రిక  విలేకరుగా,  మాజీ కార్పొరేటర్ గా హైదరాబాద్ నగరానికి ఎంతో  పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చారని ఈ సందర్బంగా వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. కొరివి కృష్ణ స్వామి తన సొంత డబ్బులతోనే ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి ఆ రోజుల్లో ప్రజలకు ఏం జరిగినా ? తెలియ జేసే ప్రయత్నం చేసారని అన్నారు. సొంత డబ్బులతోనే  పేపర్లలో ప్రచురించి ప్రజలకు తెలిపిన ఏకైక వ్యక్తి కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ అని కొనియాడారు. 

అతను మేయర్ గా ఉన్నప్పుడు అప్పటి భారతదేశ మాజీ ప్రధాని నెహ్రూ  హైదరాబాద్ విచ్చేసిన సమయంలో ఎక్కడ ఏ సదుపాయాలు కావాలని ఆలోచించి విక్టోరిల్ అని ఒక పుస్తకం సృష్టించి దాంట్లో అన్ని పొందుపరచడం జరిగిందని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలో ఏ ఏ సదుపాయాలు ఎక్కడెక్కడ చేయాలని తాను ఆ రోజున ఆలోచించి ఒక పెద్ద ప్రణాళిక తయారు చేసిన గొప్ప వ్యక్తి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ అని తెలియ జేశారు. ఆయన పేరు మీద కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేక చొరవ తీసుకొని కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ పేరుమీద ప్రతి సంవత్సరం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందించేలా కృషి చేయాలనీ కోరారు. అదేవిధంగా జర్నలిస్ట్ ల కోసం ఒక జర్నలిస్ట్ కాలనీని ఏర్పాటు చేసి ఆ కాలనీకి కొరివి  కృష్ణ స్వామి ముదిరాజ్ పేరు పేరు పెట్టాలని సూచించారు. పత్రిక విలేకరులు కరోనా సమయంలో వాళ్ల ప్రాణాలను  కూడా లెక్కచేయకుండా ఏ క్షణంలో ఏం జరిగినా ఏ వీధిలో ఏం జరిగినా అప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేసే ప్రయత్నం చేసారని పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....