కోరుమానుపల్లె గ్రామ సవిూపంలో వైభవంగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట

కొలిమిగుండ్ల, జనవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : కొలిమిగుండ్ల మండలంలోని కోరుమానుపల్లె గ్రామ సవిూపంలో నూతనంగా నిర్మించిన పట్టాభిరామ ఆలయంలో ఏకశిలా శ్రీరాముని విగ్రహాన్ని సోమవారం నాడు వైభవంగా  ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఇటిక్యాల బాలిరెడ్డి, రామకృష్ణారెడ్డి, కొండయ్య గౌడ్‌ ఇంకా తదితర గ్రామాల పెద్దల ఆధ్వర్యంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తజన సందోహం మధ్య ఘనంగా ప్రతిష్టించారు. ముందుగా ఏకశిలా విగ్రహాన్ని క్రేన్‌ సహాయంతో ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల బాలిరెడ్డి, ఇటిక్యాల శేఖర్‌ రెడ్డి, కోటపాడు ఈశ్వర్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, కొండయ్య గౌడ్‌, తిమ్మనాయునిపేట కృష్ణయ్య, కుమార్‌, భూపాల్‌ రెడ్డి, ఇంకా తదితర గ్రామాల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....