క్షణాల్లో షుగర్ తగ్గాలంటే … ?

మధుమేహం అనేది దాదాపుగా అంటువ్యాధి స్థాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల మందికి పైగా ప్రజలు షుగరు వ్యాధితో బాధపడుతున్నారు. భారత దేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉంది. దీనికి చికిత్స లేదు. రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రిచవచ్చు. కానీ దీనికి మందులు ఒకటే కాదు. ఆహారం, జీవన శైలిలో మార్పులు కూడా చేసుకోవాలి. ఉల్లిపాయ మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల నుండి చాల వరకు విముక్తి ప్రసాదిస్తుందని ఒక సర్వేలో తేలింది. రక్తంలో చెక్కరను నియంత్రించడంలో ఉల్లిపాయ సారం అద్బుత ప్రభావాన్ని చూపుతుందని బ్రిటిష్ వెబ్ సైట్ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. 

ఉల్లిపాయ రసంతో అత్యంత లాభాలు :  

మధుమేహాన్ని నియంత్రించడానికి మనకు అందుబాటులో ఉన్న చౌకైనా మార్గం ఉల్లిపాయ రసం. ఉల్లిపాయ రసం రక్తంలో చెక్కలను 50% తగ్గిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం ఉల్లిపాయ సారం మధుమేహంలో ఔషధాల వలె ప్రభావ వంతంగా ఉంటుంది. ఎలుకలపై దీన్ని ప్రయోగించి చూడగా ఆశ్చర్యమైన ఫలితాలు వచ్చాయి. అమెరికాలో స్సైన్స్ పై జరిగిన వార్షిక సదస్సులో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను సమర్పించారు. ఉల్లిపాయ రసం ఇచ్చిన ఎలుకలకు కూడా కొలస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉన్నాయి. ఎటువంటి సమస్యలు ఎదురవలేదు. మధుమేహం వంటి అనేక సమస్యల నుంచి బయట పడటమే కాకుండా కొలెస్ట్రాల్ ను దూరం చేయడంలో ఉల్లిపాయ ఎంతగానో సహకరిస్తుందని తేలింది. 

జీవన శైలిలో మార్పు చాలా అవసరం  : 

మధుమేహాన్ని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి క్రమం తప్పకుండా వ్యాయామం, పర్యవేక్షణ,బరువు నియంత్రణ, సమతుల్య ఆహారం చాల ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.    

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....