గంజాయి విక్రయిస్తున్న పెడ్లర్‌ పట్టుబడ్డ ఇద్దరు జూనియర్‌ DOCTORS..!!

హైదరాబాద్‌ జులై 6 (ఇయ్యాల తెలంగాణ ):కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వద్ద జూనియర్‌ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తూ ఓ పాత నేరస్తుడిని తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో, సుల్తాన్‌ బజార్‌ పోలీసులు రైడ్స్‌ చేసి రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. గంజాయి పెడ్లర్‌ సురేష్‌ సింగ్‌ పై గతంలో ఐదు కేసులు నమోదు అయ్యాయి. శనివారం కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వద్ద జూనియర్‌ డాక్టర్లు అయిన డాక్టర్‌ కె.మణికందన్‌, డాక్టర్‌ వి. అరవింద్‌ లు గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడిన జూనియర్‌ డాక్టర్‌ లు టెస్ట్‌ లో పాజిటివ్‌ రావడంతో వారిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మెడికల్‌ కాలేజీలో ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. వారి వద్ద నుండి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్‌ ఫోన్స్‌ సీజ్‌ చేశారు. ఇద్దరు జూనియర్‌ డాక్టర్‌ లతో పాటు గంజాయి పెడ్లర్‌ ను సుల్తాన్‌ బజార్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....