గణతంత్ర దినోత్సవ వేడుకల పోస్టర్‌ ను విడుదల చేసిన మంత్రి సీతక్క

హైదరాబాద్ జనవరి 25 (ఇయ్యాల తెలంగాణ ): 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  సామాజిక తెలంగాణ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు ప్రజా రాజ్యాధికార ఉత్సవం పేరుతో నిర్వహించదలచిన కార్యక్రమాల పోస్టర్‌ ను డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీ రాజ్‌డమహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిచే అవిష్కరింపచేయడం జరిగింది ఈ సందర్భంగా ూుూం రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళ అజయ్‌ మాట్లాడుతూ 75 సంవత్సరాల గణతంత్ర దేశంలో భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం,హక్కుల తో జీవిస్తున్నారని రాజ్యాంగ విలువలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాక్‌ ఓటింగ్‌,మాక్‌ అసెంబ్లీ, రాజ్యంగ పీఠిక పఠనం, పుస్తకాల పంపిణీ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ లకు సామాజిక న్యాయం అందే విధంగా పోరాటం చేస్తామని పేర్కొన్నాడు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు లింగంపల్లి మనోజ్‌, గుగ్గిళ్ళ మధు,అజ్జమారి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....