గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ.. బాణా సంచా కాలుస్తూ… ముగ్గురి అరెస్ట్‌

లక్నో అక్టోబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌ లో కొందరు పుట్టినరోజు వేడుకల సందర్భంగా గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ.. బాణా సంచా కాలుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వీడియో ఆధారంగా ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు.రాజ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోపల ముగ్గురు వ్యక్తులు కారుపైకప్పుపై నిలబడి బాణసంచా కాలుస్తూ.. డబ్బులు వెదజల్లారు. అపార్ట్‌మెంట్‌ యజమానుల సంఘం వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా సదరు యువకులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.నంద్‌గ్రామ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రవి కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ.. యువకులు అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించారని, ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించారన్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....