గృహలక్ష్మి దరఖాస్తు గడువును పొడిగించాలని విూసేవ కార్యాలయాల ముందు ధర్నా

మంథని ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ ):గృహలక్ష్మి దరఖాస్తు గడువును పొడిగించాలని  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్‌ డిమాండ్‌ చేశారు.బుధవారం మంథనిలోని విూసేవ కేంద్రాల వద్ద గృహలక్ష్మి దరఖాస్తుదారులతో  కలసి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్‌ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, గతంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ గృహలక్ష్మి పథకానికి 3 లక్షల రూపాయలు సరిపోవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గృహలక్ష్మి దరఖాస్తులు కేవలం మూడు రోజులే ఇవ్వడం వల్ల చాలామంది నిరుపేదలు దరఖాస్తు చేసుకోవడం లేదని, కులము, ఆదాయం సర్టిఫికెట్లు కావాలని నిబంధన పెట్టడం వల్ల విూ సేవలో చుట్టూ తిరుగుతూ దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారని, దరఖాస్తు గడువును నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని దరఖాస్తు దారుల ఎంపిక గ్రామసభల ద్వారానే తీర్మానం చేయాలని అదే విధంగా కులం, ఆదాయం సర్టిఫికెట్ల మరియు సదరం సర్టిఫికెట్లను ఇవ్వాలన్న నిబంధనలను తొలగించాలని, గ్రావిూణ ప్రాంతంలో చాలామందికి ఇండ్ల స్థలాలకు పట్టాలు లేవని కేవలం మహిళల పేరుపైనే దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనలు సరికాదని, భార్యాభర్తల్లో ఎవరికి, ఒక్కరి పేరుపైన పట్టా ఉన్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బావు రవి, దరఖాస్తుదారులు పెద్ద మొత్తంలో ధర్నా లో పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....