మంథని ఆగష్టు (ఇయ్యాల తెలంగాణ ): గృహలక్ష్మి పథకంలో పట్టా భూములతో సంబంధం లేకుండా ఎంపిక చేసి, గడువు మరి కొన్ని రోజులు పెంచాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం మంథనిలోని బీజేపీ పార్టీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ లక్ష్మి పథకం నాలుగు రోజులు గడువు పెట్టడం ఎంత వరకు సమంజసం అన్నారు. గృహలక్ష్మి అని ఒక పథకం పెట్టి ఈ పథకం దీని గురించి అవగాహన చేయకుండా ఏ విధంగా కూడా ప్రజలకు దీని గురించి ఒక వివరిస్తూ వాళ్లకి ఆ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇయ్యకుండా కేవలం నాలుగు రోజులకు గడువు ఇచ్చి అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పి ప్రజలందరికీ దీనికి కావాల్సిన ప్రొసీజర్ ఏంది కూడా తెలియకుండా కేవలం ఒక నాలుగు రోజులు మొత్తం అప్లికేషన్ చేయాలని చెప్పడం ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందొ తెలుస్తుందన్నారు.మంథని నియోజకవర్గం లో 70 నుండి 80 శాతం నిరుపేదల భూమలు అబది, ఇందిరమ్మ ఇనాం భూములు, అసైన్డ్ భూములు, గ్రామ కంఠం భూములు ఎక్కువుగా ఉన్నాయని ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి నిర్దేశించిన మార్గదర్శకాలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో పట్టాలతో సంబంధం లేకుండా గ్రావిూణ స్థాయిలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి నిజమైన నిరుపేదలను పారదర్శకంగా ఎంపిక చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది..ఈకార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిది పోతారవేణి క్రాంతికుమార్, అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, మండల ఇంచార్జ్ తోట మధుకర్, ఉప అధ్యక్షులు రేపాక శంకర్, ఎస్ సి మోర్చా మండల అధ్యక్షులు బూడిద రాజు, ఐటీ,ఎస్‌ఎం మంథని అసెంబ్లీ కో`కన్వీనర్ తొట్ల రాజు, సీనియర్ నాయకులు సత్య ప్రకాష్, మల్లిక్ పటేల్,పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడ్ల సాగర్, ఉప అధ్యక్షులు దాసరి శ్రవణ్, గురువేష్,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు, మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షరీప్,యువ నాయకులు నరామల్ల విజయ్, ఆర్ల సదానందం, తదితరులు పాల్గొన్నరు.
- Homepage
- Telangana News
- గృహలక్ష్మి పథకం గడువు మరి కొన్ని రోజులు పెంచాలి
గృహలక్ష్మి పథకం గడువు మరి కొన్ని రోజులు పెంచాలి
Leave a Comment