గేటర్‌లో CANTONMENT ప్రాంతాల విలీనానికి సిద్ధం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

హైదరాబాద్‌ జూన్ 26, (ఇయ్యాల తెలంగాణ ):2024, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జీహెచ్‌ఎంసీ లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కంటోన్మెంట్‌ బోర్డుల పరిధిలోని ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ.గిరిధర్‌ న్యూఢల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో మంగళవారం వర్చువల్‌గా సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షలో పాల్గొన్న సీఎస్‌ శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రికి తెలియజేశారు. బ్రిటిష్‌ పాలన నుంచి దేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్‌ బోర్డులను రద్దు చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి గిరిధర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....