మహబూబాబాద్ జులై,1, (ఇయ్యాల తెలంగాణ ):విశాఖపట్నం నుంచి ముంబై వెళుతున్న లోకమాన్యల తిలక్ ఎక్స్ ప్రెస్ గేదెను ఢీకొట్టి నిలిచిపోయింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ శివారు 431/1 మైలురాయి వద్ద రైలు పట్టాల పై గేదె ను ఢీకొంది. ఎయిర్ బ్లాక్ తో రైలు నిలిచిపోయింది. సిబ్బంది మరమ్మతులు చేసారు. ఘటనలో వెనుక స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి.