‘గేమ్‌ ఛేంజర్‌’ Movie నుంచి సెకండ్‌ సాంగ్‌ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో

సెప్టెంబర్‌ 28న గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్‌ ఇండియా మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా నుంచి  సెకండ్‌ సాంగ్‌ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’ విూదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, జీ స్టూడియోస్‌, దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దిల్‌ రాజు, శిరీష్‌  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

‘గేమ్‌ ఛేంజర్‌’ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌, సినీ లవర్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్‌ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చేశారు. సెప్టెంబర్‌ 28న సినిమా నుంచి  సెకండ్‌ సాంగ్‌ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలియజేశారు. పల్లవిలోని లైన్స్‌ చూస్తుంటే.. మ్యూజికల్‌ సెన్సేషన్‌ తమన్‌ నుంచి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీ నుంచి పక్కా మాస్‌ బీట్‌ సాంగ్‌ ఆడియెన్స్‌ను అలరించబోతుందని అర్థమవుతుంది. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్‌ అనంత్‌ శ్రీరామ్‌ రాశారు.

 ఇప్పటికే ‘గేమ్‌ చేంజర్‌’ నుంచి  వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేషన్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా సెకండ్‌ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ సరికొత్త ఎనర్జీనిచ్చింది.  వినయ విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ.. గేమ్‌ ఛేంజర్‌లో అలరించటానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్‌ పెయిర్‌ సందడిని సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాలనే ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తోంది. ఇయర్‌ ఎండిరగ్‌లో క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ టు న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్‌  కనిపిస్తోంది గేమ్‌ ఛేంజర్‌ యూనిట్‌ లో.

 లార్జర్‌ దేన్‌ లైఫ్‌ చిత్రాలను అబ్బురపరిచే రీతిలో తెరకెక్కించే శంకర్‌ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ను రూపొందిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.

నటీ నటులు:

రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, జయరాం, నవీన్‌ చంద్ర తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....