హైదరాబాద్, జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): ఆషాడమాస గ్రామదేవతలకు విశిష్ట పూజలు చేసే కులవృతులకు ఎన్నో ఉన్నతమైన పండుగ మన బోనాల పండుగ అని ఉమ్మడి దేవాయాల వృత్తిదారుల సంఘం పాత నగరం సంఘం ఉపాధ్యక్షులు గట్టు బాబు ఆధ్వర్యంలో మేకల బండ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం – శ్రీ సింహ వాహిని మహాకాళి దేవాలయం లాల్ దర్వాజా అమ్మవార్లకు ఒడి బియ్యం పసుపు బొట్టు యాప కొమ్మల కల్లు శాఖ నిర్వహించడం జరిగింది. ముందుగా శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం కు డప్పు బ్యాండ్ సప్పులతో ఊరేగింపు వెళ్లి కమిటీ అధ్యక్షులు పొన్నం వెంకటరమణ ఆహ్వానం పలికి ఒడిబియ్యం పసుపు కుంకుమ యాప కొమ్మల కల్లు శాఖ సమర్పించి కుల వృత్తి వాళ్లకు సన్మానం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామదేవతలలో కుల వృత్తులు వాళ్ళు ఉంటారని వారికి ప్రధానమైన పాత్ర వహిస్తారు. వారికి మనం గౌరవించాలని అన్నారు తదుపరి
కార్యక్రమం శ్రీ సింహవాహిని మహాకాళి దేవాలయంకు అమ్మవారికి ఒడిబియ్యం పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ యాప కొమ్మల కల్లు శాఖ సమర్పించి కమిటీ వాళ్ళు సన్మానం చేసి వాళ్లు మాకు పని వాళ్ళందరికీ పేరుపేరున సన్మానం చేశారు. వారికి వారి కమిటీ మా వృత్తిదారుల సంఘం ధన్యవాదాలు తెలిపారు. సంఘం అధ్యక్షులు పేరోజీ మహేశ్వర్ ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్ కోశాధికారి గట్టు సుదర్శన్ ఉపాధ్యక్షులు బర్రెల జగదీష్ అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ బొడ్డుపల్లి బాలేశ్వర్ నర్సింగరావు కొల్లూరు వెంకటేష్, రామకృష్ణ, వీరేందర్ కుమార్, దేవులపల్లి పాండు, అమర్నాథ్, రాజేష్ వినయ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.