గ్రూప్‌ 2 Exams కు అంతా సిద్ధం !

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ గ్రూప్‌`2 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో గ్రూప్‌`2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్‌`2 హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. అభ్యర్థులు డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లతో గ్రూప్‌`2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం సెషన్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను 1.30 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. ఈ సమయం దాటిపోయిన తర్వాత వచ్చిన వారికి పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని టీజీపీఎస్సీ ప్రకటించింది.టీజీపీఎస్సీ గ్రూప్‌`2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. టీజీపీఎస్సీ షెడ్యూల్‌ ప్రకారం… పేపర్‌`1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌`2 ఉంటుంది. ఇక డిసెంబరు 16వ తేదీన పేపర్‌3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్‌`2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. హాల్టికెట్లు డౌన్లోడ్‌ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040`23542185 లేదా 040`23542187 నంబర్లకు సంప్రదించాలని టీజీపీఎస్సీ తెలిపింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....