గ్రూప్‌`4 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌: TSPSC

హైదరాబాద్‌ మే 17 (ఇయ్యాల తెలంగాణ) :  గ్రూప్‌`4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడిరచింది. జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనరల్‌ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలవనున్నారు.కమ్యూనిటీ, నాన్‌ క్రిమి లేయర్‌(బీసీలకు), పీడబ్ల్యూడీ సర్టిఫికెట్స్‌, స్టడీ లేదా రెసిడెన్స్‌ సర్టిఫికెట్స్‌(క్లాస్‌ 1 నుంచి ఏడు వరకు), రిజర్వేషన్‌ కలిగి ఉంటే దానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఏజ్‌ రిలాక్సేషన్‌, క్వాలిఫికేషన్‌ సర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో వీటిలో ఏ డాక్యుమెంట్‌ సమర్పించకపోయినా ఆ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....