చంద్రబాబుకు మధ్యంతర బెయిలు మంజూరు

విజయవాడ అక్టోబర్ 31 (ఇయ్యాల తెలంగాణ ):టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. స్కిల్‌ స్కామ్‌ కేసులో గత 53 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ లో ఉంటున్నారు.అయితే చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడిరచారు.అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసారు.. దీంతో హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ను హైకోర్టు మంజూరు చేసింది.సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....