హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ); మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ప్రధాని మోడీ, తెలంగాణ సిఎం కేసీఆర్ వున్నారని కాంగ్రెస్ నేత మదు యాష్కి ఆరోపించారు. దీని వెనుక కేసీఆర్ పాత్ర పై మాకు పూర్తి స్థాయి సమాచారం ఉంది. చంద్రబాబు గతంలో మోదీ కి వ్యతిరేకంగా పనిచేసినందుకు కక్ష సాధింపు చర్యలు వున్నాయి. బాబుకు బెయిల్ రాకుండా మోదీ, కేసీఆర్ అడ్డుకుంటున్నారు. బాబు అక్రమ అరెస్ట్ పై జగన్ సర్కార్ కుట్ర వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారు. బాబు అరెస్ట్ పై కేసీఆర్,కేటీఆర్ లు ఎందుకు స్పందించడం లేదు. ఆంధ్రా సెటిలర్స్ ఓట్ల కోసం ఎల్బీనగర్ ఎమ్మెల్యే మేకతోలు కప్పుకున్న పులిలా వ్యవహరిస్తున్నాడని అన్నారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచింది చంద్రబాబు, కాంగ్రెస్ దయతోనే. ఆమాద్మీ ఉప ముఖ్యమంత్రి నీ లిక్కర్ స్లామ్ లో అరెస్ట్ చేశారు . ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేసి జైల్ లో పెట్టారు. మరి లిక్కర్ స్లామ్ లో కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు. మోదీ,కేసీఆర్,జగన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని అయన అన్నారు
- Homepage
- National New
- చంద్రబాబు అరెస్ట్ వెనుక MODI , KCR లు కాంగ్రెస్ నేత మధు యాష్కి
చంద్రబాబు అరెస్ట్ వెనుక MODI , KCR లు కాంగ్రెస్ నేత మధు యాష్కి
Leave a Comment
Related Post