చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా

న్యూఢల్లీ అక్టోబర్ (ఇయ్యాల తెలంగాణ ): రాజమండ్రి జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ ను  మంగళవారం  జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సిద్దార్ద లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, మను సింఫ్వీు కూడా వాదనలు వినిపించారు. తదుపరి విచారణను కోర్టు  సోమవారానికి వాయిదా వేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....