చంద్రబాబు బెయిల్‌ పై పవన్‌ కళ్యాణ్‌ హర్షం

విజయవాడ అక్టోబర్ 31 (ఇయ్యాల తెలంగాణ ); టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్‌ లభించడం పట్ల జనసేనాని పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు.  ఎక్స్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుచంద్రబాబు నాయుడు కు హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్‌ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడిరచిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయనఅనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు  విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం’ అని ట్వీట్‌ చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....