చంద్రయాన్‌… ఆ పావు గంటే కీలకం

 

నెల్లూరు, జూలై 13, (ఇయ్యాల తెలంగాణ ): జులై 14న చంద్రయాన్‌ 3 ఇస్రో చేపట్టనున్న చంద్రయాన్‌ 3 మిషన్‌ పై అంచనాలు పెరుగుతున్నాయి. దేశమంతా ఈ ప్రయోగంపై ఆసక్తి చూపిస్తోంది. జులై 14వ తేదీన మధ్యాహ్నం 2.35 నిముషాలకు శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. చంద్రయాన్‌ 2కి ఇది కొనసాగింపు అని ఇప్పటికే వెల్లడిరచింది. 2019 సెప్టెంబర్‌లో చంద్రయాన్‌ 2  ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. అయితే…ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌, ప్రపల్షన్‌ సిస్టమ్‌లలో లోపాల కారణంగా అది సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ అవ్వలేదు. చంద్రుడి ఉపరితలంపై అది క్రాష్‌ అయింది. ఆ ప్రాజెక్ట్‌లో తలెత్తిన సమస్యల్ని గుర్తించిన సైంటిస్ట్‌లు ఆ సవాళ్లను అధిగమించేలా చంద్రయాన్‌ 3ని తెరపైకి తీసుకొచ్చారు. సేఫ్‌ ల్యాండిరగ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

1. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్‌ అయ్యేలా చేయడం

2. రోవర్‌ సరైన విధంగా చంద్రుడిపై తిరిగేలా చేయడం

3.సైంటిఫిక్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌ 

2020 జనవరిలో ఇస్రో తొలిసారి చంద్రయాన్‌ 3పై ప్రకటన చేసింది. డిజైన్‌పై పని చేస్తున్నామని, త్వరలోనే స్పేస్‌క్రాఫ్ట్‌ అసెంబ్లింగ్‌ పూర్తవుతుందని అప్పట్లో వెల్లడిరచింది. చంద్రయాన్‌ 2 కన్నా పకడ్బందీదా దీన్ని డిజైన్‌ చేశారు. ముఖ్యంగా ల్యాండర్‌ లెగ్స్‌ని మరింత దృఢంగా తయారు చేశారు. నిజానికి 2021లోనే ప్రయోగించాలని భావించినా కొవిడ్‌ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సెకండ్‌ వేవ్‌ వల్ల మరింత జాప్యం జరిగింది. అప్పటికే ప్రపల్షన్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌ పూర్తౌెంది. ఇన్ని రోజుల తరవాత జులై 14న లాంఛ్‌ చేస్తామని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.   ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ల్యాండర్‌, రోవర్‌ మాడ్యూల్‌ వేరువేరుగా ఉన్న ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రుడి సౌత్‌ పోల్‌కి సవిూపంలో ల్యాండ్‌ అవ్వనుంది. ఒక లూనార్‌ డే అంటే మన భూమిపై 14 రోజుల పాటు అక్కడ ఆపరేట్‌ అవుతుంది. చంద్రయాన్‌ 2 ట్రాజెక్టరీలోనే చంద్రయాన్‌ 3 కూడా కొనసాగుతుంది. ప్రపల్షన్‌ మాడ్యూల్‌ భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్‌ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్‌ విడిపోతుంది. లాంఛ్‌ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్‌ దిగుతుంది. ఇస్రో అంచనాల ప్రకారం ఆగస్టు 23`24 వ తేదీల్లో అది ల్యాండ్‌ అవుతుంది. అయితే..చంద్రుడిపై సన్‌రైజ్‌ ఎలా ఉందన్న దానిపైనే ల్యాండిరగ్‌ ఎప్పుడవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. సన్‌రైజ్‌లో ఆలస్యం జరిగితే..ల్యాండిరగ్‌ కూడా లేట్‌ అవుతుంది. అదే జరిగితే…ఇస్రో ల్యాండిరగ్‌ని సెప్టెంబర్‌కి రీషెడ్యూల్‌ చేస్తుంది. కానీ…ఈ మిషన్‌లో అసలైన క్రూషియల్‌ పాయింట్‌ ఇదే. ల్యాండిరగ్‌కి కనీసం 15 నిముషాల సమయం పడుతుంది. అందుకే…ఇస్రో మాజీ ఛైర్‌పర్సన్‌ కే శివన్‌ ‘‘15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’’ అని డిఫైన్‌ చేశారు. ఒక్కసారి సేఫ్‌గా ల్యాండ్‌ అయిన తరవాత ల్యాండర్‌  నాలుగు సైంటిఫిక్‌ పేలోడ్స్‌ని  చంద్రుడి ఉపరితలంపై డిప్లాయ్‌ చేస్తుంది.  అవే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులను స్టడీ చేస్తాయి. ఈ మాడ్యూల్‌లో  పరికరం అమర్చి ఉంటుంది. భూమి ఎంత కాంతిని రిఫ్లెక్ట్‌ చేస్తుంది..? ఎంత ఎమిట్‌ చేస్తోంది..? అనే డేటాని ఈ పరికరం సేకరిస్తుంది. ఇక రోవర్‌ ప్రగ్యాన్‌ కెమికల్‌ టెస్ట్‌ల ద్వారా లూనార్‌ సర్‌ఫేస్‌పై పరిశోధనలు చేపడుతుంది.

 చెంగాలమ్మ  సెంటిమెంట్‌ ఏంటంటే ,జులై 14వ తేదీ కోసం యావత్‌ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.. మరికొన్ని గంటల్లో అద్భుతం సాకారం కానుంది. చంద్రయాన్‌ `3 ప్రయోగం కోసం దేశం మొత్తం శ్రీహరి కోటవైపు చూస్తోంది. 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్‌ లాంచ్‌ వెహికల్‌ ఎంకే`3 సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయోగాన్ని కచ్చితంగా విజయవంతం చేయాలని అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇస్రో ఏ ప్రయోగాన్ని చేపట్టినా, ముందు ఒక ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.అదే తిరుపతి జిల్లాలోని సూళ్లూరు పేట పట్టణంలోని చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆనవాయితీ దశాబ్దాల నుంచి వస్తోంది. అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్‌తో పాటు మరికొందరు అధికారులు ఈ ఆలయాలంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. చెంగాళమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతే రాకెట్‌ ప్రయోగాలు చేపట్టడం ఇస్రోకు ఒక సెంటిమెంట్‌. ఇటీవల ఇస్రో చేపట్టి ఖూఒఅ`అ55 రాకెట్‌ ప్రయోగానికి కూడా ముందు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇస్రో తాజాగా చేపడుతోన్న చంద్రయాన్‌`3 ప్రయోగం నేపథ్యంలో కూడా ఇస్రో ఛైర్మన్‌ చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇంతకీ శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని ఎందుకు దర్శిస్తారు.? ఈ ఆలయం చరిత్ర ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..తిరుపతి జిల్లా, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన సూళ్లూరు పేటలో ఉందీ ఆలయం. ఈ ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. పదో శతాబ్దకాలంలో పశువుల మేతకు తీసుకెళ్లిన కొందరు యువకులు పవిత్ర కళంగి అనే నదిలో ఈతకు వెళ్లారని, నీటి ప్రవాహం ధాటికి కొట్టుకుపోతూ ఒక శిలను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారంటా.. అనంతరం ఆ యువకులంతా ఆ శిలను బయటకు తీసి ఒడ్డు విూద ఉన్న ఓ చెట్టు వద్దకు చేర్చారు. యువకులు ఆ శిలను పడుకోబెట్టగా తిరిగి ఉదయం వచ్చే చూసే సరికి నిలబడి కనిపిచింది. దీంతో ఆశ్చర్యానికి గురైన గ్రామస్థులు.. ఆ మహిషాసురమర్ధనియే స్వయంభుగా వెలిసిందని భావించి.. విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకెళ్లి నిర్మించారని చెబుతారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....