చంద్రుడిపై భారత రెపరెపలు

శ్రీహరికోట, ఆగస్టు 23 (ఇయ్యాల తెలంగాణ );భారత్‌ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్‌ చారిత్రక క్షణాలకు వేదికైంది.  ల్యాండర్‌ సురక్షితంగా దిగాలని ఆలయాల్లో హోమాలు, దర్గాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేస్తుకున్న వ్యోమనౌక దక్షిణ ధ్రువంపై ల్యాండిరగ్‌కు ఉపక్రమిస్తోంది. ఇదిలా ఉండగా.. చంద్రయాన్‌`3 వ్యోమనౌక షెడ్యూల్‌ కంటే ముందే ల్యాండిరగ్‌ అయింది.  ఈ సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంది.  ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడిరచింది.’’ ఆటోమేటిక్‌ ల్యాండిరగ్‌ సీక్వెన్స్‌(ఏఎల్‌ఎస్‌)ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని ఇస్రో ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ‘‘సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ నిర్దేశిత ల్యాండిరగ్‌ ప్రదేశానికి రానుంది. ఏఎల్‌ఎస్‌ కమాండ్‌ను స్వీకరించిన వెంటనే ల్యాండర్‌ మాడ్యూల్‌ థ్రాటల్‌బుల్‌ ఇంజిన్ల వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్తుంది’’ అని ఇస్రో రాసుకొచ్చింది. ల్యాండిరగ్‌ ప్రక్రియను సాయంత్రం 5.20 గంటల నుంచే ఇస్రో తమ వెబ్‌సైట్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. గంటకు దాదాపు 6 వేల కిలోవిూటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యోమనౌక జోరుకు ఈ 17 నిమిషాల్లోనే కళ్లెం వేసి, చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దించాలి. దీన్ని సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ అంటారు. ల్యాండిరగ్‌ పూర్తయిన తర్వాత వెంటనే వ్యోమనౌక కాళ్లలోని ‘టచ్‌డౌన్‌ సెన్సర్లు’.. ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌కు మెసేజ్‌ను పంపుతాయి.విక్రమ్‌ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ కావాలని దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు జరిగాయి.. యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా హరిద్వార్‌లో హోమం చేశారు. 

రాజస్థాన్లోని అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాలో ప్రార్థనలు జరిగాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని పాటలు పాడారు. అలాగే ల్యాండిరగ్‌ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం కోసం వారంతా ఎదురుచూసారు.  ప్రముఖ సైకత శిల్పి సదర్శన్‌ పట్నాయక్‌ తన కళతో చంద్రయాన్‌`3 విజయాన్ని ఆకాంక్షించారు. చంద్రయాన్‌`3 ప్రయోగం విజయం సాధించాలంటూ సోషల్‌ విూడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ల్యాండర్‌ ల్యాండిరగ్‌ అయిన తర్వాత రోవర్‌ బయటకు వస్తుంది. ల్యాండర్‌, రోవర్‌ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగించనున్నాయి.41రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లికి చేరువైంది చంద్రయాన్‌`3. సుమారు 4లక్షల కిలోవిూటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై  ల్యాండ్‌ అయింది. ల్యాండర్‌ విక్రమ్‌. బుధవారం సాయంత్రం 5:45కి ల్యాండిరగ్‌ ప్రక్రియ మొదలైంది.  జర్నీ సక్సెస్‌ అవ్వడంతో.. భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. జాబిల్లి దక్షిణ ధృవంపై దిగింది చంద్రయాన్‌`3 ల్యాండర్‌. అత్యంత భారీ మంచు నిల్వలు ఉన్నట్టు భావిస్తోన్న దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండిరగ్కి ప్రయత్నించింది. చంద్రుని ఉపరితలంపై దిగే టైమ్లో రెండు ఇంజిన్లను ఆన్‌ చేసారు. చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా జులై 14న నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్‌`3. శ్రీహరికోట నుంచి

 అంతరిక్షంలోకి వెళ్లిన చంద్రయాన్‌`3… వివిధ దశలను దాటుకొని చంద్రునికి దగ్గరైంది. అంతా అనుకున్నట్టు చంద్రునిపై అడుగుపెట్టింది. ఆ వెంటనే.. ల్యాండర్‌ కాళ్లకు అమర్చిన సెన్సార్లు.. జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్‌ అయ్యాయి. సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ జరిగింది. ప్రపంచ దేశాల చూపులన్నీ చంద్రయాన్‌`3పైనే!. జాబిల్లిపై చంద్రయాన్‌`3ని భారత్‌ సాఫ్ట్‌ ల్యాండ్‌ చేయగలుతుందా లేదా అని వెయ్యి కళ్లతో చూస్తున్నాయ్‌! చంద్రయాన్‌ 3 ల్యాండిరగ్కు సంబంధించి ఓ కీలక ట్వీట్‌ చేసింది ఇస్రో. అంతా అనుకూలంగా ఉందని.. ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ల్యాండర్‌ ప్రతి కార్యాచరణను తాము గమనిస్తున్నామని తెలిపింది. చంద్రుని దగ్గర 10 విూటర్లకు చేరుకున్న వెంటనే చంద్రయాన్‌ వేగం సెకనుకు 1.68 విూటర్లుగా ఉంటుంది. ల్యాండిరగ్‌ సమయంలో వేగాన్ని కొలవడానికి వాహనంలో లేజర్‌ డాప్లర్‌ వెలోసివిూటర్ను అమర్చారు. సాఫ్ట్‌ ల్యాండిరగ్ను విజయవంతం చేసేందుకు.. ఇస్రో చంద్రయాన్‌ ల్యాండిరగ్‌ అల్గారిథమ్ను మార్చింది. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్సింగ్‌ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు కంగ్రాట్స్‌ తెలిపారు. ప్రధాని మోదీ కృషి వల్లే చంద్రయాన్‌`3 గమ్యాన్ని చేరుతోందని అన్నారు. చంద్రయాన్‌ సక్సెస్‌ అవుతుందంటూ పేర్కొన్నారు. 54ఏళ్ల ప్రస్థానంలో అనేక సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పాటైతే, కేవలం ఆరేళ్లలోనే తొలి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపి సంచలనం సృష్టించింది. 1975లో ఆర్యభట్టను నింగిలోకి పంపి విజయం సాధించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి సక్సెస్‌ కొట్టింది ఇస్రో.చంద్రునిపై ఇంతవరకూ మూడు దేశాలే సాఫ్ట్ల్యాండిరగ్‌ చేశాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే మూన్‌ మిషన్లో సఫలం అయ్యాయి. ఇప్పుడు విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ తో  నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. 
ఇస్రో సైంటిస్టుల కుటుంబాల్లో సంబరాలు..జాబిల్లి విూద చంద్రయాన్‌ అడుగుపెట్టిన వేళ ఈ మిషన్లో భాగస్వాములైన సైంటిస్టుల కుటుంబాలు సంబరాల్లో మునిగితేలుతున్నాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....