చనిపోయిన నాలుగేళ్లకు Government ఉద్యోగం ! కన్నీళ్లు పెట్టుకున్న పోస్ట్‌ మ్యాన్‌ !

హైదరాబాద్‌, జూన్‌ 22, (ఇయ్యాల తెలంగాణ) : సర్కార్‌ కొలువు సాదించడమే లక్ష్యంగా ఆరేళ్లు కష్టపడ్డాడు. రెండుసార్లు కొలువుకు ప్రయత్నించాడు. ఫలితం రాకపోవడంతో మనోవేధనకు గురయ్యాడు. అదే సమయంలో అనారోగ్యంతో అక్కా, తల్లి మృతి చెందడంతో మరింత కుంగిపోయాడు. ఇక, సర్కార్‌ కొలువు రాదని తీవ్ర మనస్తాపంతో ఉరి వేసుకునికి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ యువకుడు. తీరా ఆ యువకుడు చనిపోయిన నాలుగేళ్లకు ప్రభుత్వం ఉద్యోగం సాధించావంటూ పిలుపు వచ్చింది. ఉద్యోగంలో చేరాలంటూ ఇంటికి ఉత్తరం వచ్చింది. కానీ, ఆ యువకుడు చనిపోయాడని తెలిసిన సమాచారం తెచ్చిన పోస్ట్‌ మ్యాన్‌ సైతం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. మరణం తర్వాత పలకరించిన సర్కార్‌ కొలువు పిలుపు వార్త మంచిర్యాల జిల్లాలో చోటు  చేసుకుంది. మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతం మందమర్రి ఫస్ట్‌ జోన్‌ కి చెందిన సిద్దెంకి మొండయ్య, సరోజ దంపతులకు నవీన్‌ కుమార్‌, అనూష, ఆదిత్య, జీవన్‌ కుమార్‌ నలుగురు సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. జీవన్‌ కుమార్‌ (24) 2014లో ఐటీఐ పూర్తి చేశారు. 2018 లో వెలువడిన విద్యుత్‌ శాఖ లైన్‌ మెన్‌ పోస్ట్‌ కు అప్లై చేశాడు. పరీక్ష కూడా రాసి ఫలితాల కోసం ఎదురు చూశాడు. అదే సమయంలో అనారోగ్యంతో అక్క ఆదిత్య 2018 లో మృతి చెందింది.. ఆ వెంటనే తల్లి సరోజ సైతం అనారోగ్యంతో జనవరి, 2019లో మరణించింది.వరుస విషాదాలు ఓ వైపు ఉద్యోగం దక్కడం లేదని మరో వైపు మనోవేధనకు గురయ్యాడు జీవన్‌ కుమార్‌. సింగరేణిలోను ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమవడంతో 2020 మార్చి 15న ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు జీవన్‌ కుమార్‌. జీవన్‌ మృతి చెందిన ఏడాదికే అక్క అనూష, తండ్రి మొండయ్య సైతం మృతి చెందడం ఆ ఇంటిని వల్లకాడుల మార్చింది. ఆరుగురు కుటుంబ సభ్యులున్న ఆ ఇంట్లో వరుస మరణాలతో చివరకు పెద్దకొడుకు నవీన్‌ ఒక్కరే మిగిలాడుఇంత విషాదం నిండిన ఆ ఇంటిని రెండు రోజుల క్రితం ఓ వార్త మరింత కన్నీళ్లు పెట్టించింది. జీవన్‌ కుమార్‌ ను వెతుక్కుంటూ వచ్చిన ఫోస్ట్‌ మ్యాన్‌ విూకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని నవీన్‌ కుమార్‌ కు లెటర్‌ అందించాడు. 

మా తమ్ముడు చనిపోయి నాలుగేళ్లైందంటూ కన్నీరు మున్నీరయ్యాడు నవీన్‌. శుభవార్త మోసుకొచ్చానని భావించిన ఫోస్ట్‌ మ్యాన్‌ సైతం ప్రభుత్వ ఉద్యోగ కాల్‌ లెటర్‌ అందుకోవాల్సిన వ్యక్తి నాలుగేళ్ల క్రితమే చనిపోయాడని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఉద్యోగ చివరి పరీక్షకు హాజరు కావాలని కాల్‌ లెటర్‌ రావడం మరింత బాధించిందని జీవన్‌ కుమార్‌ అన్న నవీన్‌ కుమార్‌ తెలిపాడు. ఈ ఘటన మందమర్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎన్పీడీసీఎల్‌ లో జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ కోసం 2018లో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది అప్పటి సర్కార్‌. మిగులు పోస్టుల భర్తీ విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ నిలిచి పోయింది. ఈ పోస్ట్‌ తప్పక సాధిస్తానని ఆశలు పెంచుకున్న జీవన్‌ కుమార్‌.. రెండేళ్లైన సమాచారం రాకపోవడం ఇంట్లో వరుస మరణాలతో గుండె బరువెక్కి మనోవేధనతో ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం కొత్త ప్రభుత్వం నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మందమర్రికి చెందిన జీవన్‌ కుమార్‌ కు విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్షకు ఈ నెల 24న హాజరుకావాలని కాలెటర్‌ రావడం.. అప్పటికే అతను చనిపోయి నాలుగేళ్లు అయిందని తెలియడంతో.. ఏం చేయాలో తెలియక కాల్‌ లెటర్‌ తిరిగి తీసుకెళ్లక తప్పలేదు పోస్ట్‌ మ్యాన్‌ కు.సర్కార్‌ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, నాలుగేళ్ల క్రితమే జీవన్‌ కుమార్‌కు కొలువు వచ్చి ఉంటే, ఆ ఇళ్లు సుఖ సంతోషాలతో ఉండేదేమో అని, ఇప్పుడు అయిన వారందరని కోల్పోయి వల్లకాడుల మారేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....