చరిత్రకు నిలువెత్తు నిదర్శనం – అక్కన్న మాదన్న ఆలయం


హైదరాబాద్, జూలై 24 (ఇయ్యాల తెలంగాణ)

 అత్యంత ప్రసిద్ది గాంచిన దేవాలయాల్లో  శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం చాలా ప్రాచుర్యమై నది.శతాబ్ధాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి న విషయాలను మనం గమనిస్తే మనకు ఎన్నో విశే షాలు తెలుస్తాయి. ముఖ్యంగా తానీషా ప్రభువల కా లం నుంచే ఇక్కడ కొలువుదీరిన అమ్మవారికి పూజ లు జరుగుతూ వచ్చాయి .అత్యంత ఘనచరిత్ర కలి గిన మహంకాళి అక్కన్న,మాదన్నల పేర్లతోనే ఆల యం సరిక్రొత్త చరిత్రను సృష్ఠించుకుంది. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే…..17వ శతా బ్దంలో గోల్కొండను పాలిస్తున్న తానీషా ఆస్థానంలో  సైన్యాధ్యక్షుడిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అక్కన్న,మాదన్నలు ఎక్కువగా ఈ  ఆలయంలో అమ్మవారిని కొలిచేవారు.భారతదేశ స్వాతంత్య్ర అనంతరం హైదరాబాద్‌ దక్కన్‌  భారత్‌లో 1948లో విలీనం అయ్యింది. అప్పటి నుంచి అక్కన్న,మాదన్న మహంకాళి ఆలయం అందుబాటులోకి వచ్చింది. 

అప్పటి నుంచి ….ఇప్పటి వరకు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూవస్తున్నారు. ఈ ఆలయం అమ్మవారి విగ్రహాన్ని అంభారిపై ఊరేగించడం సామూహిక మాతేశ్వరి ఘాటల ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణ. జంగయ్య ఈ ఆలయానికి చేసిన సేవలు కొనయాడలేమూ. ప్రస్తుతం ఆలయకమిటి ఛైర్మన్‌ జి.నిరంజన్‌, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ తదితర ప్రముఖుల పర్యవేక్షణలో ఉత్సవాలు ప్రతిఏటా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మహంకాళి ఉత్సవాలకు సంబంధించిన ప్రతి అంశానికి కూడా ఎగ్జిబిషన్‌ను ఆలయం ఎదుట హాల్‌లో ఏర్పాటు చేయడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ చూస్తే చాలు బోనాల చరిత్ర భక్తులకు అర్ధమవుతుంది.అంతేకాకుండా ఈ ఆలయంలో ఏర్పాటు చేసే కుంకుమార్చనకు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజల్లో అత్యంత భక్తి పారవశ్యాన్ని అందిస్తుంది.బోనాల పండుగ రోజు వేలాదిమంది భక్తులు అక్కన్న మాదన్న ఆలయాన్ని దర్శించు కుంటారు.ఘటాల ఊరేగింపు రోజు కూడా వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....