చాంద్రాయణగుట్టలో SC డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో

హైదరాబాద్, ఆగష్టు 01 (ఇయ్యాల తెలంగాణ) : ఉపవర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దేశం నలుమూలలా పండుగ వాతావరణం కనిపించింది. ఓల్డ్ సిటీ లోని  చాంద్రాయణగుట్టలో ఎస్సీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్ర పటానికి పాలభి షేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ ను దేశ ఉన్నత న్యాయ స్థానం ఆమోదిస్తూ తీర్పును ఇవ్వడం పై ఎస్సీ డెవలప్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పులికంటి నరేష్ ఆధ్వర్యంలో కందికల్ గేట్ భట్జి నగర్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సుప్రీం కోర్టు తీర్పు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం  అధ్యక్షులు నాగేశ్వర్ రావు,ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....