చార్‌ధామ్‌ యాత్ర లో 31 మంది మృతి

డెహ్రాడూన్‌,మే 14 (ఇయ్యాల తెలంగాణ) : ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ యాత్రకు వెళ్లిన భక్తుల్లో ఇప్పటి వరకు 31 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మే 3వ తేదీన చార్‌ధామ్‌  యాత్ర ప్రారంభమైంది. మౌంటేన్‌ సిక్నెస్‌తో పాటు ఇతర కారణాల వల్ల భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. హై బీపీ, హార్ట్‌ అటాక్‌, మౌంటేన్‌ సిక్నెస్‌తో యాత్రికులు చనిపోయినట్లు ఆరోగ్యశాఖ డీజీ  డాక్టర్‌ శైలజా భట్‌ తెలిపారు. ప్రయాణ మార్గంలో ఉన్న పాయింట్ల వద్ద హెల్త్‌ స్క్రీనింగ్‌ చేపడుతున్నట్లు చెప్పారు. రిషికేశ్‌లోని రిజిస్ట్రేషన్‌ సైట్‌ వద్ద ప్రయాణికులను స్క్రీనింగ్‌ చేస్తున్నారు. పండుకేశ్వర్‌ వద్ద  కూడా స్క్రీనింగ్‌ క్యాంపును ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....