చార్మినార్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కై కె.వెంకటేష్‌ దరఖాస్తు

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ );రాబోయే శాసనసభ ఎన్నికల్లో చార్మినార్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు టిక్కెట్టును కేటాయించాలని  కోరుతూ చార్మినార్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ కె.వెంకటేష్‌ శుక్రవారం గాంధీభవన్‌ లో  దరఖాస్తును సమర్పించారు. అంతకు ముందు చారిత్రాత్మక లాల్‌ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాంధీభవన్‌ కు వెళ్లి తన దరఖాస్తును టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కు కార్యాలయంలో అల్లం భాస్కర్‌ లకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్‌  మాట్లాడుతూ గత 20  సంవత్సరాల నుండి పార్టీకి విధేయునిగా అంకితభావంతో కట్టుబడిగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీ తనకు చార్మినార్‌ నుండి పోటీ చేసే అవకాశం కల్పించిందని అనంతరం గత పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పార్టీ ఆదేశాల అనుగుణంగా ప్రజల పక్షాన అనేక సార్లు నిరస,ధర్నా,రాస్తారోకోలు, పోరాటాలు చేపట్టి అరెస్టులు అయిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. బీసీ మేరు సామాజిక వర్గానికి చెందిన తనకు నియోజకవర్గంలో అన్నివర్గాల ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఈ సారి టికెట్‌ తనకు కేటాయిస్తే గెలుపు తనదేనని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....