చిక్కుల్లో గులాబీ (BRS) నేతలు !

కరీంనగర్‌, ఆగస్టు 23, (ఇయ్యాల తెలంగాణ) : కేసీఆర్‌ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ చేస్తోంది. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. ప్రాజెక్టు మొదలుపెట్టిన నుంచి జరిగిన తతంగాన్ని పూసగుచ్చి మరీ బయటపెట్టారు మాజీ ఈఎస్సీ నరేందర్‌రెడ్డి.నాలుగేళ్లు బ్యారేజీలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని కమిషన్‌ ముందు వెల్లడిరచారాయన. అలా వదిలేయడం వల్లే వైఫల్యం చెందాయని చెప్పుకొచ్చారు. గేట్లు ఎత్తడంలో మాన్యువల్‌ను పాటించ లేదని తెలిపారు. బ్యారేజ్‌ నిర్మాణంలో సున్నితమైన పనులను ఫ్లడ్‌ లైట్స్‌ వెలుగులో చేశారని వివరించారు. అంతేకాదు కాంక్రీట్‌ ను అపరిమిత వేగంతో నింపారన్నది ఆయన చెబుతున్న మాట. ముఖ్యం గా టెండర్ల ఖరారు, బ్యారేజీల వైఫల్యంలో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపాలు ప్రధానంగా కారణమని తేలినా ఈఎన్సీ పదవీకాలం పొడిగించారని తెలిపారు.మేడిగడ్డ బ్యారేజ్‌ డిజైన్లను సీడీవో ఒక్కరే తయారు చేయలేదని మాజీ ఈఎస్సీ నరేందర్‌రెడ్డి వెల్లడిరచారు. సీడీవోతో కలిసి ఎల్‌ అండ్‌ టీ తయారు చేసిందన్నారు. నిర్మాణానికి ముందు బ్యారేజీల ప్రదేశాలను పరిశీలించామని, నిర్మాణం ప్రారంభమైన తర్వాత వెల్లలేదన్నారు. మేడిగడ్డ నిర్మాణం, నాణ్యతలో తీవ్ర లోపాలు జరిగాయని వెల్లడిరచారు.వర్షాకాలంలో ముందు వెనుక చేపట్టాల్సిన పనులను చేయలేదన్నారు మాజీ ఈఎన్సీ. నిర్మాణ సమయంలో తనిఖీలు లేవని స్పష్టంచేశారాయన. ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేసిందెవరని ప్రశ్నించగా.. సెంట్రల్‌ డిజైన్‌ రూపొందించిందని, ఇందులో ఎల్‌ అండ్‌ టీ ఇంజినీర్లు కూడా ఉన్నారని నరేందర్‌ రెడ్డి వివరించారు. 

డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసిన నరేందర్‌ రెడ్డి.. మెయింటెనెన్స్‌ లోపాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు డ్యామేజీ జరిగిందని చెప్పారు.ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి చర్చలకు తనను పిలువలేదని, తాను ఎక్కడా చర్చల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. తాను కన్‌స్ట్రక్షన్‌ జరిగిన ప్రాంతానికి వెళ్లలేదని వివరించారు. కన్‌స్ట్రక్షన్‌ తన పరిధిలోనిదే కాదని చెప్పారు. లొకేషన్స్‌ ఆధారంగా డిజైన్స్‌, డ్రాయింగ్‌ తయారు చేశామని తెలిపారు.2023లో మేడిగడ్డ ఏడో బ్లాక్‌ కుంగిన తర్వాత వెళ్లి పరిశీలించానన్నారు. సీడబ్ల్యూసీకి పంపిన తర్వాత కూడా డిజైన్‌లలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయని నరేందర్‌ రెడ్డి తెలిపారు. బ్యారేజీల నిర్వహణ సరిగా లేదని చెప్పిన ఆయన మేడిగడ్డ ఘటన తర్వాత కూడా సరిదిద్దే అవకాశం ఉందని చెప్పారు. తగిన రీతిలో సత్వరమే స్పందించలేదన్నారు.నిర్మాణ సంస్థ, ఇంజనీర్లు పట్టించుకోలేదని, వైఫల్యానికి కారణమైన వారికే మళ్లీ బాధ్యతలు అప్పగించారని కమిషన్‌ ముందు వెల్లడిరచారు.మాజీ ఇంజనీర్లు ఇచ్చిన ఆధారాల ప్రకారం ఆనాటి ప్రభుత్వ పెద్దలను విచారణకు రప్పించాలనే ఆలోచనలో కమిషన్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడైనా గత ప్రభుత్వం పెద్దలు కమిషన్‌ ముందుకు వెళ్తారా? లేక సమయం కావాలని తప్పించుకుంటారా? అన్నది చూడాలి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....