చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్‌


నందికొట్కూరు అక్టోబర్‌ 10 (ఇయ్యాల తెలంగాణ ):చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని నందికొట్కూర్‌ ఐసిడిఎస్‌  సూపర్వైజర్‌ వెంకటేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని వడ్డేమాన్‌ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో భాగంగా చిరుధాన్యాలతో వివిధ రకాల వంటలు చేసి తక్కువ ఖర్చుతో  ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తయారుచేసి తల్లులకు వివరించారు . ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాగులు , కొర్రలు, సజ్జలు ,అలసందలు,  మొక్కజొన్నలు, పెసలు తదితర వాటి ప్రాముఖ్యత గురించి అధికారులకు వివరించారు. పూర్వీకులు పోషకాహారంతీసుకోవడంతో వారు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే చిరుధాన్యాలను  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనిమిక్‌ గర్భవతులు, బాలింతలు, పిల్లలకు వైద్యాధికారులచేపరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ  కార్యదర్శి భాగ్యలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు లలితమ్మ ,వెంకటరమణమ్మ, ఇందిరమ్మ, అంగన్వాడీ ఆయాలు శ్రీలక్ష్మి,మమత ,సుశీల తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....