చెడ్డి GANG తరహాలో కొత్తగా కలకలం సృష్టిస్తున్న చుడీదార్‌ GANG

హైదరాబాద్‌ మే 20 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా చుడీదార్‌ గ్యాంగ్‌ కలకలం సృష్టిస్తుంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి జెక్‌ కాలనీలోని ఆకృతి ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లో దుండగులు చుడీదార్‌ వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్‌ రావు అనే వ్యక్తి ఇంట్లో 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్‌ టాప్‌ ను చుడీదార్‌ వేసుకున్న గ్యాంగ్‌ దొంగతనం చేసింది. ఇద్దరు దుండగులు చుడీదార్‌ ధరించి దొంగతనానికి పాల్పడిన వీడియో సిసి టివి ఫూటేజీలో నిక్షిప్తమైంది. ఈ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....