చెడ్డీ గ్యాంగ్‌… హల్‌ చల్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21, (ఇయ్యాల తెలంగాణ );అమ్మో.. యమ డేంజర్‌ ఘజియాబాద్‌ గ్యాంగ్‌.. చెడ్డి గ్యాంగ్‌.. పార్ధు గ్యాంగ్‌ ను మించిన ఘరానా దొంగలు వీళ్ళు..ఒకటికాదు రెండుకాదు ఆరు రాష్ట్రాల్లో వరుస దోపిడీలతో షేక్‌ చేశారు. కారులో వచ్చి క్లాస్‌ గా దోచుకు పోయారు..పాపం పండి వరంగల్‌ పోలీసుల చేతికి చిక్కారు. ఆ ముఠా నుండి కిలోల కొద్ది బంగారం, వజ్రాల అభరణాలు, తుపాకీ దొరికింది.. కార్లలో వచ్చి క్లాస్‌ గా దోచుకుపోయే డేంజర్‌ దొంగలంతా యూపీ కి చెందిన ఒకే కుటుంబంగా వరంగల్‌ పోలీసులు గుర్తించారు.. ఢల్లీి నుండి మొదలుకొని కర్ణాటక, మహారాష్ట్ర,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్రాలలో వరుస దోపిడీలతో హడలెత్తించారు.. వరంగల్‌ లో కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏడు అపార్ట్మెంట్లలో చోరీలకు పాల్పడ్డారు..అపార్ట్‌మెంట్లలో తాళంవేసి వున్న ఇండ్లను టార్గెట్‌గా చేసుకోని ప్రత్యేక యంత్రాలతో తాళాలు బ్రేక్‌ చేసి దోపిడీలకు బరి తెగించారు.. చోరీ లు మాత్రమేకాదు కారులో క్లాస్‌ గా గంజాయి రవాణా చేస్తున్న ఆ నలుగురు సభ్యుల ముఠా వరంగల్‌ పోలీసుల చేతికి చిక్కింది.. ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూల్‌ జిల్లా పోలీసులు డ వరంగల్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ లో ఈ ముఠా పట్టుబడిరది..వీరి నుండి రెండు కోట్లు విలువగల సూమారు 2కిలో 380 గ్రాముల బంగారు, వజ్రాల అభరణాలు, ఐదు లక్షల 20 వేల రూపాయల విలువ గల 14కిలోల ఎండు గంజాయితో పాటు ఒక పిస్టల్‌, ఐదు రౌండ్లు బుల్లెట్స్‌, ఒక కారు, నాలుగు సెల్ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ అధార్కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన ముఠా అంతా ఓకే కుటుంబం? వారిలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ కు చెందిన మహమ్మద్‌ అక్బర్‌ ఖురేషి, కపిల్‌ జాటోవు, మహమ్మద్‌ షరీఫ్‌, మహమ్మద్‌ జాద్‌ ఖాన్‌ వున్నారు.. వీరంతా ఘజియాబాద్‌ కు చెందిన వారే.. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.5వ తేదిన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఏడు అపార్ట్మెంట్లల్లో తాళంవేసి వున్న ఎనిమిది ఫ్లాట్స్‌ లలో చోరీలకు పాల్పడ్డారు.. బంగారు, వెండి అభరణాలతో పాటు నగదు పహరించుకు పోయారు.. వెంటనే అప్రమత్తమైన వరంగల్‌ పోలీసులు దొంగలను పట్టుకునేందుకు రంగంలో కి దిగారు.. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ తో పాటు, ఆదిలాబాద్‌, బెంగుళూర్‌ లో చోరీలు జరిగిన ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుల కదలికలకు సంబందించి సిసి కెమెరా దృష్యాలతో పాటు నిందితులు వినియోగించిన కారు ఫోటోలను సేకరించారు.. కారు నెంబర్‌ టోల్‌ గేట్‌ ఆధారంగా ఈ ముఠా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ వైపు వెళ్తున్నట్లు గుర్తించి.. కర్నూలు పోలీసులను అప్రమత్తం చేశారు.. కర్నూల్‌ పోలీసులు ఓ టోల్‌ గేట్‌ వద్ద మాటు వేసి వీరిని పట్టేశారు.ఈ ముఠా ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు జీవితం గడిపారు. జైలు నుండి విడుదలైన ఈ ముఠా సభ్యులు మళ్ళీ చోరీలకు తెగ బడ్డారు? ఈ ఘజియాబాద్‌ అంతర్‌ రాష్ట్ర ముఠా పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు వున్నాయి.. ఈ ముఠా పై వరంగల్‌ లో పీ. డీ యాక్ట్‌ నమోదు చేస్తున్నారు.. వీరిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వరంగల్‌ ? కర్నూల్‌ పోలీసులను సీపీ రంగనాథ్‌ అభినందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....