చొప్పదండి కాంగ్రెస్‌ MLA భార్య ఆత్మహత్య

మేడ్చల్‌, జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ) : చొప్పదండి కాంగ్రెస్‌  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య  రూపా దేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్‌ లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఆమె ఉరి వేసుకున్నారు. రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని సమాచారం  రమాదేవి ఆత్మహత్య అర్ధరాత్రి బయటకు వచ్చింది.  ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు భార్య వీడియో కాల్‌ చేసారు.బుధవారం అల్వాల్‌ నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండికి వెళ్లగా, సాయంత్రం ఆయనకు రూపాదేవి వీడియో కాల్‌ చేసి చనిపోతున్నానని చెప్పారు. మేడిపల్లి సత్యం ఇంటికి చేరుకునేలోపే ఆమె ఆత్మహత్య చేసుకోగా, విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి సత్యం బోరున విలపించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....