ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌లో ఇవాళ Encounter


ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు, ఒక భద్రతా సిబ్బంది మృతి

నారాయణపుర్‌ జూన్‌ 15 (ఇయ్యాల తెలంగాణ): ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌లో ఇవాళ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు, ఒక భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అబుజ్‌మాడ్‌ అడవుల్లో ఇవాళ ఉదయం ఎన్‌కౌంటర్‌ మొదలైంది. నారాయణపుర్‌, కంకేర్‌, దంతేవాడ, కొండగావ్‌ జిల్లాలకు చెందిన భద్రతా దళాలు యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు రాయ్‌పూర్‌ సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఇంకా అక్కడ ఫైరింగ్‌ నడుస్తున్నట్లు చెప్పారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, 53 బెటాలియన్‌ ఐటీబీపీకి చెందిన దళాలు జూన్‌ 12వ తేదీన కూంబింగ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టాయి. ఎన్‌కౌంటర్‌కు చెందిన మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....